
'నేను ఒక్కడిని ఒకవైపు...లోకం ఒకవైపు' అన్నట్టుగా దేశమంతా కరోనా ముప్పుతో అల్లాడిపోతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం నాకివేమీ పట్టవు...నా పబ్లిసిటీ నాకు ముఖ్యం అంటూ స్టన్ట్లు వేస్తూనే ఉన్నాడు. ఆర్జీవీ వేలుపెట్టి గెలకని విషయమంటూ లేదు. అందులోనూ...పవన్ ఫ్యాన్స్ ను ఎప్పుడు రెచ్చగొట్టే పనిలోనే ఉంటాడు. తాజాగా పవర్ స్టార్ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తున్నానని వెల్లడించారు. దానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి, పవర్ స్టార్ పై పాటను కూడా రిలీజ్ చేశారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో పవన్ కల్యాణ్ కేరెక్టర్ ని తగ్గించి చూపించినందుకే ఫ్యాన్స్ ఈగో హర్ట్ అయ్యింది. అలాంటిది డైరెక్ట్ గా పవర్ స్టార్ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తున్నా అనగానే పవన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. వెంటనే వర్మ మీద సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయారు. పరాన్నజీవి అనే టిటిల్ ఫిక్స్ చేసి, “రెక్లెస్ జెనెటిక్ వైరస్” అనే క్యాప్షన్ పెట్టారు. అందులో RGV అనే లెటర్స్ హైలైట్ చేయబడి ఉన్నాయి. దీంతో ప్రతీ ఒక్కరికీ ఆ పరాన్నజీవి ఎవరో బాగా అర్ధమైపోయింది.