
సంక్రాంతి వచ్చిందటే చాలు పిల్లలు, పెద్దలు పండగతో పాటు సినిమాలు రిలీజ్ అవుతాయని సంబరాలు చేసుకుంటారు. సినీ అభిమానులకు సంక్రాంతి అంటే చాలా ముఖ్యమైన పండగ. సినిమా చూసేందుకు టికెట్ల కోసం గంటలు గంటలు క్యూలో నిలోచడానికి కూడా వెనుకాడరు. ఈ పండగ సీజన్ డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు కూడా అంతే ముఖ్యమైనది. ఈసారి సంక్రాంతికి ఏకంగా నాలుగు చిత్రాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' , అల్లు అర్జున్ 'అల...వైకుంఠపురంలో' , కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివడవురా' , రజనీకాంత్ 'దర్బార్'. ఇప్పటికే దర్బార్ రిలీజ్ కాగా, మిగితా మూడు సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల సీఎంలు డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో ఆరు షోలు ప్రదర్శించేందుకు సీఎం జగన్ అంగీకరించగా...తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఆరు షోలు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రేక్షకులు కూడా పండగ చేసుకుంటున్నారు.