
రైతు బంధు పధకంలో కీలక మార్పులు చేయనున్న కేసీఆర్
గత ఏడాది ఎన్నికలకు కొన్ని నెలల ముందు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు కేసీఆర్ సర్కారు. అప్పుడు రెండు విడతల్లో రూ.8వేల చొప్పున రైతులకు ఆర్ధిక సాయం అందించారు. కానీ ఆ తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు రైతు బంధం పధకంలో రావాల్సిన నిధులను ఇంకా విడుదల చేయలేదు. దీంతో రైతులకు ఇంకా ఆర్ధిక సాయం అందలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రైతు బంధు పధకంలో కొన్ని మార్పులు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రైతులకు పంట పెట్టుబడి కోసం ఏడాదికి ఎకరానికి రూ.10వేలు ఇస్తూ వచ్చింది. ఇదివరకు ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు సాయం అందించిన ప్రభుత్వం.. ఇకనుంచి 10 ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అందించే ఆలోచనలో ఉన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రబీ సీజన్ నుంచి దీన్ని అమలుచేసే అవకాశం ఉందంటున్నాయి.