
దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ యొక్క ప్రముఖ సంగీత కంపోస్టర్లో ఎంఎం కీరవాని ఒకరు. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పెద్ద బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' కు ట్యూన్స్ అందిస్తున్నారు. ఇది చురుకైన వేగంతో షూటింగ్ జరుపుకుంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ పీరియడ్ డ్రామాకి కీరవాణి సంగీతం అందించటానికి అతను తీసుకుంటున్న పారితోషికం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఆర్ఆర్కు రెమ్యునరేషన్ గా కీరవాణి రూ. 16 కోట్లు తీసుకున్నటున్నట్లు తాజా గాసిప్లు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉండగా...ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.