
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్ అయింది. అన్నట్లుగానే బొమ్మ దద్దరిల్లింది. ఇక దాని తర్వాత డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను ప్రారంభించిన విషయం తెల్సిందే. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచిందనే చెప్పాలి. కరోనా మహమ్మారి కారణంగా మహేష్ ఇంటికే పరిమతమయ్యారు. ఇక ఇన్నిరోజులకు గాను మహేష్ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డైరెక్టర్ పరుశురాం నవంబర్ నుంచి రెగులర్ షూటింగ్ ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే మహేష్ సరసన హీరోయిన్ గా మొదట కీర్తి సురేష్ ను అనుకున్న విషయం విధితమే. కానీ ఇప్పుడు సిన్ మారిపోయినట్లు కనిపిస్తుంది. పరుశురాం మరో స్టార్ హీరోయిన్ ను సంప్రదించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ డేట్స్ కుదరకనో, ఇప్పుడే షూటింగ్ కు అంగీకరించకనో, కారణం ఏదైనా కానీ ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మరి పరుశురాం సంప్రదించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఏంటన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.