
'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు కారణం ఆమె ఎంచుకున్న పాత్రలు, కధలు. సావిత్రి కధను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయితే సావిత్రినే చూసినంతగా నటించడంలో కీర్తి నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది. ఆ సినిమాతో కీర్తికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే కీర్తి తాజాగా ఓ డేరింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే... త్వరలో నిర్మాణ బాద్యతలను స్వీకరించబోతుందట. మొదట వెబ్ సిరీస్ తో ప్రారంభించి ఆ తర్వాత సినిమాలకు రావాలని ప్లాన్ చేస్తుంది. ఓ కధ బాగా నచ్చడంతో తమిళ్ లో వెబ్ సిరీస్ ను నిర్మించాలని రంగం సిద్ధం చేసిందని సమాచారం. మరి కీర్తి తీసుకున్న ఈ నిర్ణయంలో కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం.