
అసలు ఎటువంటి అంచనాలు లేకుండా అప్పటి వరకు శాండల్ వుడ్ అంటే చిన్న చూపు చూసిన వారికీ సమాధానంగా వచ్చింది 'కెజిఎఫ్'. కేవలం సొంత భాషలోనే కాకుండా అన్ని భాషల్లోనూ రికార్డులను కొల్లగొట్టింది. ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ అవ్వడంతో చాప్టర్ 2 ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో యశ్‌కు సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు అధీరా లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచినట్లే.. ఈ కొత్త లుక్ కూడా అదుర్స్ అనిపిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను వచ్చేనెల 8న ఉదయం 10.38కి విడుదల చేస్తామని సినిమా బృందం ప్రకటించింది. కాగా, ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా మొదటి భాగం చివరలో అధీరా పాత్ర గురించి వివరించి, అధీరా రెండో భాగంలో వస్తాడని సూచించారు. రెండో భాగం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.