
రామ్ చరణ్, ఎన్టీఆర్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న రాజమౌళి "ఆర్ఆర్ఆర్" జూలై 30న విడుదల చేయడం లేదని టీం షూటింగ్ ప్రారంభించినప్పుడు ప్రకటించారు. అయితే కొన్ని ఉహించని పరిస్థితులల కారణంగా ప్లాన్ చేసిన ప్రకారం షెడ్యూల్ జరగలేదు. అందుకే మేకర్స్ ఆ తేదీన రిలీజ్ చేయటం కష్టమని తప్పుకుంది. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని వాయిదా వేయటంతో.. ఇప్పుడు "కేజీఎఫ్2" ఆ డేట్ ను సొంతం చేసుకుంది. ఇది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కేజీఎఫ్2' ఇప్పుడు జూలై 30న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. యష్ ప్రధాన పాత్రలో నటించిన కెజిఎఫ్ శాండల్ వుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీలలో కూడా సంచలనాత్మక హిట్ గా నిలిచింది. దీంతో కేజీఎఫ్ సిక్వెల్ పై అంతటా ఆసక్తి నెలకుంది. అందుకే జులై 30న విడుదల చేయటం సరనైనదని భావిస్తున్నారు మేకర్స్.