
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా "భారత్ అనే నేను"తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది కీయారా అద్వానీ. మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తరువాత కీయారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన యాక్షన్ డ్రామా 'వినయ విదేయ రామ'లో కథానాయికగా నటించింది. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయింది. అయితే, ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా కీయారా అద్వానీను తీసుకునేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఈమేరకు దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ చిత్రంలో హీరోయిన్ గా నటించమని కీయారాను అడగగా, ఆమె ఆ ఆఫర్ ను తిరస్కరించిందని సమాచారం. కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేతిలో పలు పెద్ద స్టార్ల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల వరుణ్ తేజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ మేకర్స్ కూడా ఆమెను సంప్రదించినట్లు ఆమె దాన్ని కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.