
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రభాస్ సినిమాకు ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాక మిగితా అన్ని ఇండస్ట్రీలలోను క్రేజ్ ఏర్పడింది. అందుకే తన సినిమాల్లో హీరోయిన్లను ఆచితూచి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా అంచనాలను మరింత పెంచుతూ చిత్ర యూనిట్ అందాల నటి కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నట్లుగ తెలుస్తుంది. కత్రినా, దీపికా వంటి పెద్ద పేర్లు వినిపించినప్పటికీ కబీర్ సింగ్ లో తన యాక్టింగ్ తో కియారా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను మెప్పించినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే అంచనాలు డబల్ అవ్వడం గ్యారెంటీ.