
రచన అనుభవం ఉంది కానీ దర్శకుడిగా లేదు అయినప్పటికీ మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. మరెవరో కాదు దర్శకుడు కొరటాల శివ. మిర్చి సినిమాతో మొదలైన అతని ప్రయాణం శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంది. రాజమౌళి తర్వాత కెరియర్ లో కేవలం హిట్ లు మాత్రమే అందించిన ఏకైక దర్శకుడు కొరటాల శివ. అయితే అతని రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఉందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న 'ఆచార్య' సినిమాకు సుమారు 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తో తియ్యబోయే సినిమాకు అక్షరాల రూ. 15 కోట్లు తీసుకోబోతున్నట్లుగా తెలుసుతుంది. ఇదే నిజమైతే రాజమౌళి, త్రివిక్రమ్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుల్లో కొరటాల శివ చేరుతారు.