
మెగాస్టార్ చిరంజీవి హీరోగా క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ తాజగా మళ్ళీ తిరిగి ప్రారంభించి షెరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇదిలా ఉంటె ఈ సినిమాను నిర్మిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వినిపిస్తుంది. కానీ అది చిన్నదా లేదా పెద్ద రోల్ ఆ అనేది తెలియదు. అయితే తాజాగా కొరటాల శివ దీనిపై కాల్ర్టీ ఇచ్చారు. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర చాలా కీలకం మరియు ఎక్కువ లెంగ్త్ ఉంటుందని..వారిని ఒకే స్క్రీన్ పై చూసేందుకు నేను ఎదురుచూస్తున్నాని తెలిపారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రేటింపు అయ్యాయి.