
బీజేపీ జాతీయ రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తన సత్తా చాటేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ ఆకర్ష్ పేరిట ఇప్పటికే టీడీపీ కీలక నేతలను తన గూటికి లాగేసుకుంది. కేవలం తెలుగు దేశం పార్టీయే కాక మిగితా పార్టీలలో కీలకంగా ఉన్న నేతలను తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ కౌశల్ మండా బీజేపీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డ బీజేపీ కండువా కప్పి కౌశల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. బిగ్ బాస్ సీజన్ 1 సమయంలో కౌశల్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీ మెజారిటీతో టైటిల్ గెలిచాడు. కౌశల్ ఆర్మి అంటూ సోషల్ మీడియా మొత్తం హంగామా చేసిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ కెరియర్ పరంగా తనకేమీ హెల్ప్ చేయలేదని చెప్పాలి. కౌశల్ కు ముందు నుంచే బిజినెస్‌లు ఉండటంతో అవి చూసుకుంటూ అడపాదడపా సీరియల్స్ లో తళుక్కుమంటున్నాడు.