
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆసక్తికరంగా సాగుతుంది. మధ్యలో నత్తనడక నడుస్తుందని అనిపించినా యాజమాన్యం షో లో జోష్ పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అందుకే నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆ ఇంటి కోడలు అక్కినేని కోడలిని దింపి వేడెక్కించారు. 16 మందితో మొదలైన షో ఇప్పుడు 11 మందికి చేరింది. ఇదిలా ఉంటె ఈ సీజన్ లో ఫైనల్ లో ఉండబోయే ఆ ఐదుగురు ఎవరో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ జోస్యం చెప్పారు. ఈ సీజన్ ఎలా నడుస్తోందన్న విషయంపై మాట్లాడుతూ కౌశల్ ఫైనల్ రేస్ లో నిలబడే సత్త ఈ ఐదుగురికి ఉందంటూ జోస్యం చెప్పారు. అభిజిత్, నోయల్, లాస్య, అవినాష్‌తో పాటు అఖిల్ లేదా సోహైల్ ఉంటారని కౌశల్ జోస్యం చెప్పారు. మరి అనుభవంతో చెప్పిన కౌశల్ మాటలు నిజమవుతాయేమో చూద్దాం.