
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో చిత్రం ప్రకటించినప్పటి నుండి, ప్రధానంగా హీరోయిన్ గురించి మాత్రమే చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలు అగ్రశ్రేణి బాలీవుడ్ నటీమణులు పేర్లు ఆ మధ్య జోరుగా వినిపించాయి. కానీ, ఇప్పటివరకు ఎవరు ఖరారు కాలేదు. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పవన్ కళ్యాణ్ సరసన లేడీ లీడ్ గా నటించనుండగా, ప్రగ్యా జైస్వాల్ సహాయ నటిగా కనిపిస్తుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే, తాజా సమాచారం ఏమిటంటే, దర్శకుడు క్రిష్ కొత్త హీరోయిన్ ను ఫ్రెమ్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జాక్వెలిన్ ను హీరోయిన్ గా తీసుకుంటే, ఆమె డేట్లను పవన్ డేట్లను కుదర్చడం కష్టతరం అవుతుందని, అదే కొత్త అమ్మాయి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించి క్రిష్ ముంబై అమ్మాయిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.