
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ చేతి నిండా ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్' తో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాధే శ్యామ్ లో తాను ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నానని కృష్ణం రాజు తెలిపారు. దానికి సంబంధించిన షూటింగ్ త్వరలో జరగనున్నట్లు చెప్పారు. అయితే గతంలో ప్రభాస్ హీరోగా వచ్చిన రెబల్ మూవీలో కృష్ణం రాజు నటించిన విషయం తెలిసిందే. అది అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మరోసారి కృష్ణం రాజు ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారంటే అందరిలోనూ భయం పట్టుకుంది. చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుందో అందులో కృష్ణం రాజు పాత్ర ఎలా ఉంటుందో!