
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంట సమాజానికి ఉపయోగపడే పని ఏదొకటి చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్, అతని భార్య ఉపాసన వైల్డ్ డ్రీమ్స్ అనే పేరుతో చారిటీ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, సూపర్ స్టార్ మహేష్ బాబు అతని భార్య నమ్రతా, సమంత అక్కినేని, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి జంతువులు, ఫారెస్ట్ ను కాపాడేందుకు, వాటి సంరక్షణ కోసం ఫండ్స్ సేకరించడానికి ఫిలాంత్రోపిక్ అంబాసిడర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ గా నియమించబడ్డారు. దీంతో భర్త రామ్ చరణ్ కూడా ఇందులో భాగం చేసింది. రామ్ చరణ్ కు ఫోటోగ్రఫీలో పట్టు ఉంది. రామ్ చరణ్ తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్స్ ను వాళ్ళు కండెక్ట్ చేసిన "వైల్డ్ డ్రీమ్స్" ఈవెంట్ లో ఉంచారు. ఈ మేరకు ఈవెంట్ కు వెళ్లిన మంచు లక్ష్మి "రామ్ చరణ్ ను చూస్తే గర్వంగా ఉందని" సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.