
ఓసారి ఓ దారిలో వెళ్తుండగా దెబ్బ తగిలితే ఇంకోసారి ఆ దారిలో చాలా జాగ్రత్తగా వెళ్తాము. అదే చేస్తున్నాడు హీరో నిఖిల్. వరుసగా రెండు మూడు ప్లాప్‌లు రావడంతో కధల ఎంపికలో చాల జాగ్రత్తలు పాటిస్తున్నాడు. కంటెంట్ బాగా ఉన్న కధలను ఎంచుకుంటున్న నిఖిల్ కు తన చివరి చిత్రం 'అర్జున్ సురవరం' మంచి విజయాన్ని ఇచ్చింది. తన తదుపరి చిత్రంగా '18 పేజెస్' ను ప్రకటించాడు నిఖిల్. షూటింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో కరోనా రావటంతో షూటింగ్‌లు అన్ని అటకెక్కాయి. అయితే ఈ సినిమాలో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. వీరి జోడిలో వచ్చిన 'అర్జున్ సురవరం' మంచి హిట్ అవ్వటంతో మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది. మరి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.