
ఈమధ్యకాలంలో ఓటిటిలలో సినిమాలు, వెబ్ సిరీస్ హావ ఎక్కువైపోయింది. ఎంతలా అంటే ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద తారలు, డైరెక్టర్లు, నిర్మాతలు వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టేంతగా! దీనికి తోడు కరోనా మహమ్మారి రావటం, సినిమాలు ఎక్కడివక్కడ నిలిచిపోవటంతో ఓటిటి భాట పెట్టేవారి సంఖ్య ఎక్కువయ్యింది. ఇప్పటికే తెలుగు స్టార్ హీరోయిన్లు సమంత, తమన్నా, కాజల్, నిత్యామీనన్ వెబ్ సిరీస్ లో కనిపించనుండగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ఇదే భాటలో నడవనుంది. ఆమె దేవసేన అనుష్క, ప్రముఖ ఓటిటిలో వెబ్ సిరీస్ చేసేందుకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.