
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్న చిన్న గ్యాప్ నుండి తిరిగి వచ్చి బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ యొక్క తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం పింక్ రీమేక్ షూట్ ఎంసిఎ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చురుకైన వేగంతో జరుగుతోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వ వెంచర్ సెట్స్‌లో కూడా చేరారు. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంలో తనకు సంబంధించిన షూట్ ను పూర్తి చేసి క్రిష్ దర్శకత్వంలో తన 27వ చిత్రం ప్రారంభించాడు. అయితే కొద్ది రోజుల క్రితం పింక్ రీమేక్ సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ పిక్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సెట్స్ నుండి ఒక వీడియో కూడా లీక్ అయింది. లీక్ అయిన వీడియోలో, పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడి స్థితి లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అతను రాజకీయ ర్యాలీలో మాదిరిగానే మాడ్యులేషన్‌తో గట్టిగా డైలాగ్స్ చెప్పాడు. పింక్ రీమేక్ ను బోనీ కపూర్ మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చ్ లో సినిమా విడుదల కానుంది.