ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం

తెలుగు సినీ పరిశ్రమకే కాదు యావత్ సౌత్ సినీ పరిశ్రమలకు దొరికిన ఆణిముత్యం ఎస్.పి.బి. అయన పాట పాడితే వైన్ శ్రోతులకు మాటలు రావు. ఆ నాటి ఎన్టీఆర్, ఎన్నార్ లాంటి స్టార్స్ కు స్వరాలూ ఆలపించిన దివంగత గాయకుడు ఘంటసాల తరువాత ఆ స్థాయిలో అందరిని అయన గొంతుతో మంత్రముగ్దధులను చేసిన గాయకుడు బాలసుబ్రమణ్యం. 1946 లో జూన్ 4న నెల్లూరులో జన్మించిన ఎస్.పి.బి అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచి పాటలు పాడటం హాబీగా మల్చుకున్న బాలుకి 1966 లో సినిమాకు పాడే అవకాశం వచ్చింది. కేవలం బహుభాషా గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రఙనను ప్రదర్శించారు. ఎంతమంది కధానాయకులకైనా అనుగుణంగా పాట పాడగల గొప్ప మహానుభావుడు బాలసుబ్రమణ్యం. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ గాన గంధర్వుడు రేపు కాకపోతే మరునాడు ఆరోగ్యంగా తిరిగొస్తాడనుకుంటే త్రిగిరాని లోకానికి వెళ్లారని వార్త అందరిని తీవ్ర దిగ్బ్రాంతిలోకి నేటింది. ఘంటసాలకు సిసలైన వారసుడు బాలసుబ్రమణ్యం నేడు బౌతికంగా మనతో లేకపోయినా అయన ఆలపించిన పాటల రూపంలో ఎప్పటికి మనతోనే ఉంటారు.