
రాజమౌళి బాహుబలి లాంటి ఇంటర్నేషనల్ స్థాయి సినిమా తర్వాత రామ్ చరణ్ మరియు ఎన్టిఆర్ ప్రధాన పాత్రల్లో 'ఆర్ఆర్ఆర్' అనే ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 75 శాతం షూట్ పూర్తయింది. ఇటీవల మరొక షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ తాజాగా సెట్స్ లో చేరారు. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంటే, ఆర్ఆర్ఆర్ టీంను లిక్స్ వెంటాడుతున్నాయి. ఆ మధ్య కొమరం బీమ్ గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ క్లిప్ ఒకటి లీక్ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు బల్గేరియా షెడ్యూల్లోని ఎన్టీఆర్ యొక్క వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ బృందం అనేక జాగ్రత్తలు తీసుకున్న తరువాత కూడా ఈ లిక్స్ ఎలా జరుగుతున్నాయో అని ఆశ్చర్యపోతున్నారు.