
ఏపీ మాజీ టీడీపీ మంత్రి నారా లోకేష్ సందు దొరికితే చాలు జగన్ను, జగన్ ప్రభుత్వంను విమర్శించే పనిలో ఉంటాడు లోకేష్. తాజాగా ఉల్లిపాయల ధర పెరిగేసరికి మరోసారి లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. "జగన్ ప్రభుత్వం కారణంగానే ఉల్లి ధరలు పెరిగాయి. రేషన్ కార్డు ఉంటే కానీ ఉల్లి ఇవ్వం, ఆధార్ కార్డు ఉంటే కానీ ఉల్లి ఇవ్వం" అంటూ లోకేష్ ట్విట్టర్ వేధికిగా విమర్శించారు. ఇక్కడే లోకేష్ నెటీజన్లకు దొరికిపోయారు. దేశమంతా ఉల్లి ధరలు భగ్గుమంటుంటే దానికి కారణం జగన్ ప్రభుత్వం ఎలా అవుతుంది లోకేష్ ? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఏపీలో ఉల్లిపాయలు కిలో రూ.25కే విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయటంతో ప్రజలు క్యూలు కట్టారు. రైతు బజార్లలో ఉల్లిని విక్రయించేందుకు ప్రభుత్వం కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది.