
వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ 4 తెలుగుకు టీవీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. రియాలిటీ షో యొక్క కొన్ని ఎపిసోడ్లు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటే, కొన్ని ఎపిసోడ్లు సప్పగా మారుతున్నాయి. ఈ సోమవారం, మొత్తం 9 మంది పోటీదారులు తొలగింపుకు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ లో పాల్గొన్న వారందరూ స్వచ్ఛందంగా తమను తాము నామినేట్ చేసుకున్నారు, కాని ఓటింగ్ నివేదికల ప్రకారం, నటి కరాటే కళ్యాణి డేంజర్ జోన్ లో ఉంది. బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్, అభిజీత్ మరియు అఖిల్ మధ్య ప్రేమాయణం మొదలైనట్లుగా ఉంది.
ఒక ఎపిసోడ్లో, అభిజీత్ మోనాల్‌తో తన మునుపటి రిలేషన్ షిప్స్ గురించి చెప్పాడు. అతను రెండు సీరియస్ రిలేషన్ షిప్స్ లో ఉన్నట్లు వెల్లడించాడు. అభిజీత్ అల...చెప్పడంతో మోనాల్ షాక్ అయింది. దీంతో ఆమె కూడా ఓపెన్ అయ్యి, ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చడాని మరియు అది ఆమెకు ఉన్న ఏకైక ప్రేమకథ అని వెల్లడించింది. అభిజీత్ తన రిలేషన్ ఎలాంటిదని అడిగినప్పుడు మోనాల్, అది ‘క్లిష్టమైనది’ అని చెప్పింది. హరిక తనను ఇష్టపడుతుందని మోనల్ అతనికి వెల్లడించడంతో అభిజీత్ షాక్ అయ్యాడు. మొత్తానికి హౌస్ లో మసాలా స్టార్ట్ అయ్యేటట్టు ఉంది.