
టాలీవుడ్ పలు డైరెక్టర్లు తీసే సినిమాల్లో పెద్దగా కథ కొత్తగా లేకపోయినా తీసే విధానం, మాములు జీవితానికి సంబంధించిన కధనాలు ఉండటంతో బాగా నచ్చేస్తుంటాయి. అలాంటి డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఎంతో క్లాస్ గా చూడటానికి హాయిగా, సరదాగా ఉంటాయి అందుకే అయన సినిమాలకు డిమాండ్ ఎక్కువ. ఇక తాజాగా నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. అయితే సినిమా ఇంకా రాకముందే...డిజిటల్, సాటిలైట్ రైట్స్ రూపంలో పెట్టుబడి వచ్చేసిందట. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చేందంతా లాభాలేనని తెలుస్తుంది. లవ్ స్టోరీ డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ తో కలిపి మొత్తం 16 కోట్లకు డీల్ కుదిరిందట. సినిమా బడ్జెట్ మొత్తం ఈ డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలోనే రావడం విశేషం.