
2008 లో విడుదలైన రవి బాబు చిత్రం 'నచ్చావులే'లో అను అనే పాత్రలో నటించిన తరువాత మాధవి లత వెలుగులోకి వచ్చింది. అయితే తరువాత ఆమె సినీ ప్రేమికులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో ఆమె విరామం తీసుకుని ఫ్యాషన్ డిజైనింగ్‌లో మాస్టర్స్ ను పూర్తి చేసింది. యునైటెడ్ కింగ్డమ్ లోని విశ్వవిద్యాలయంలో ఆమె మాస్టర్స్ డిగ్రీను పొందింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, మాధవి లత 2019 లో రాజకీయాల్లోకి ప్రవేశించి, గుంటూరు వెస్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి టికెట్ మీద పోటీ చేశారు. ఇప్పుడు మాధవి లత, ఆమె ఆరోగ్య మరియు సుసైడ్ కు సంబంధించిన ఫేస్ బుక్ పోస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన ఫేస్ బుక్ పోస్ట్ లో, “ఏదో ఒక రోజు, ప్రేమ చిత్రంలో రేవతి పాత్ర లాగా నేను చనిపోతానేమో. రేవతి మాదిరిగా, నేను కూడా వేసుకుంటున్న మందులు కారణంగా ఒక రోజు మరణాన్ని ఎదుర్కొంటాను. నా అనారోగ్యం నన్ను దేనిపైనా దృష్టి పెట్టకుండా చేస్తుంది. నాకు మందులంటే నచ్చవు"అని పోస్ట్ చేసింది. ఆ తరువాత వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసి..నేను బాగానే ఉన్నానంటూ పెట్టింది.