
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బొమ్మ దద్దరిల్లింది. అయితే మహేష్ దూకుడు అంతటితో ఆగలేదు తాజాగా కన్నడలోనూ ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. డబ్ చేసి కన్నడలో 'మేజర్ అజయ్ కృష్ణ' పేరుతో టెలికాస్ట్ కాగా 6.5 టిఆర్పీ రేటింగ్ తో కన్నడలో మొదటి తెలుగు డబ్డ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహ రెడ్డి' చిత్ర టిఆర్పీ 6.3 ను దాటి 6.5 సాధించి నెంబర్ వన్ గా నిలిచింది. మరి వచ్చే రోజుల్లో కన్నడలో ఈ రికార్డును ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.