
లాక్డౌన్ సీజన్ లోనూ ఎండోర్స్ మెంట్స్ విషయంలో దూకుడు చూపిస్తున్నాడు మహేష్. ఇప్పటికే పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రిన్స్.. లేటెస్ట్ గా మరో క్రేజీ ఆఫర్ పట్టేశాడట. జియో టి.వి. ప్లస్ ను సౌత్ మొత్తానికి మహేష్ బాబు ఎండోర్స్ చేయనున్నాడట. ఇక.. ఉత్తరాదిన అక్షయ్ కుమార్ ఈ ప్రోడక్ట్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఈ డీల్ కోసం మహేష్ కి భారీ మొత్తంలో అందజేయనుందట జియో సంస్థ. త్వరలోనే మహేష్ ఎండోర్స్ మెంట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. మొత్తంమీద.. ఒకవైపు సినిమాలతో పాటు.. మరోవైపు ఎండోర్స్ మెంట్స్ లోనూ దుమ్మురేపుతున్నాడు సూపర్ స్టార్.