
ఒక యాంకర్ కు ఉండాల్సిన స్పాంటేనీటి, కామెడీ టైమింగ్, సెన్స్ ఆఫ్ హుమర్, కలిసిపోయే తత్వం, ఆటలు ఆడించడం అన్ని సుమకు ఉన్నాయి. అందుకే తెలుగు బుల్లితెరపై దశాబద్ధం పాటు టాప్ యాంకర్ గా తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తుంది సుమ కనకాల. అందుకే ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇచ్చి మరీ యాంకర్ గా సుమనే ఎంపిక చేసుకుంటున్నారు నిర్మాతలు. అయితే తాజాగా జరిగిన సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేసిన సుమ.... ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. అసలేం జరిగిందటే....ఈవెంట్ లో వరసగా టీం మెంబర్స్ ఒకొక్కరు వచ్చి మాట్లాడి వెళ్తున్నారు. అలానే రష్మీక స్టేజ్ పైకి వచ్చి... 'మహేష్ ఫ్యాన్స్ ను చూస్తుంటే మాటలు రవట్లేదని' అనింది. దీంతో పక్కన ఉన్న సుమ....'పర్వాలేదు మాట్లాడు. ఇక్కడ ఎవరి డబ్బా వారు కొట్టుకోవాల్సిందే' అని కామెంట్ చేసింది. దీంతో సుమ వ్యాఖ్యలు సరిలేరు టీం పరువు తీసేలా ఉన్నాయన్న చర్చ మొదలైంది. సుమ చేసిన కామెంట్స్ పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.