
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కిన 'మహర్షి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయం ఇచ్చిన జోష్ తో మహేష్ తన తదుపరి సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. ఇదిలా ఉంటే డిజిటల్ హవా పెరుగుతున్న తరుణంలో మహేష్ కూడా ఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఓ అదిరిపోయే వెబ్ సిరీస్ ను రూపొందించాలని ఫిక్స్ అయ్యాడట. అందుకుగాను తనకు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లిని కథ సిద్ధం చేయమని కోరినట్లు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే నిర్మాతగా మహేష్, దర్శకుడిగా వంశీ వెబ్ సిరీస్ తో డిజిటల్ దునియాలోకి అడుగు పెట్టడం ఖాయం!