
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు" సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజ్ కానుంది. ఇందులో మొదటిసారి మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపించనున్నాడు. అంతేకాదు మొదటిసారి మహేష్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే నిన్నటితో షూటింగ్ పూర్తవ్వడంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ నేపధ్యంలో దర్శకుడు ట్వీట్ చేశారు. జులై 5న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అద్భుతమైన జర్నీ ప్రారంభించాం. డిసెంబర్ 18న ముగిసింది. సంక్రాంతికి మిమ్మల్ని కలుస్తాం అని ట్వీట్ చేశారు. అయితే మహేష్ బాబు కెరీయర్ లో బిజినెస్ మాన్ తర్వాత అంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రమీదే.