
మీరు విన్నది నిజమే! ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణే స్వయంగా సూపర్ స్టార్ మహేష్ తనను భర్తీ చేయడానికి ఎదురు చూస్తున్నాడు. మహేష్ బాబు, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ వార్త నిజమై ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే...మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య' లో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రను చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. అయితే ఈ పాత్రను ప్రతిభావంతుడైన నటుడు మహేష్ చేయాలని రామ్ చరణ్ కోరుకుంటున్నాడు. మహేష్, కోరాటాల శివ చెప్పిన కథనాన్ని కూడా విన్నట్లు తెలుస్తోంది. కొరటాల మహేష్ కు భారత్ అనే నేను మరియు శ్రీమంతుడు లాంటి రెండు పెద్ద హిట్లను ఇచ్చాడు. చిరంజీవి మహేష్ తాజా సినిమా "సరిలేరు నీకెవ్వరు" చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు చిరు సినిమాలో మహేష్ నటించే అవకాశం లేకపోలేదని సమాచారం.