
"దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి" అనే సామెతను ముద్దుగుమ్మ పూజ హెగ్డే తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు ఉంది. అసలు సంగతి ఏంటంటే....ప్రస్తుతం పూజ హెగ్డే, రష్మీకల టైం నడుస్తుంది. అప్ కమింగ్ పెద్ద ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు హీరోయిన్ గా కనిపిస్తున్నారు. అయితే పూజ హెగ్డే ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అల...వైకుంఠపురంలో సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఆమె చేతిలో మరో రెండు, మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంతో ఆమెకున్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ప్రొడక్షన్లో అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'మేజర్' సినిమా కోసం పూజను అడిగితే....రూ. 2.5కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నడంతో ఆమె ఎప్పుడు తీసుకునే దాని కన్నా 50లక్షలు పెంచి డిమాండ్ చేసిందట. దీంతో మేజర్ దర్శకనిర్మాతలు మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు.