
నిజమే!! సూపర్ స్టార్ మహేష్ బాబు యాంకర్ గా కనిపించనున్నాడు. నమ్మడానికి కాస్త కష్టమే. అసలు ఫంక్షన్లకే రావడం తక్కువ, సినిమాల్లో తప్పితే బయట ఎక్కువగా మాట్లాడింది లేదు అలాంటి మహేష్ యాంకర్ గా రాబోతున్నాడా ?అంటే..అవుననే చెప్పాలి. కాని, మీరు అనుకుంటున్నట్లు బిగ్ బాస్ షోకో, మరే రియాల్టీ షోకో కాదు. తన సొంత షోకే యాంకరింగ్. చేయబోతున్నాడు. అసలు విషయం ఏంటంటే...మహేష్ బాబు, రష్మీక మందన్న జంటగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు" సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో జనవరి 5న ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్ కు మహేష్ యాంకరింగ్ చేయనున్నట్లు స్వయంగా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ప్రకటించారు. కాకపోతే మొత్తం ఈవెంట్ కాకుండా ఈవెంట్ చివర్లో చిత్ర బృందాన్ని పరిచయం చేస్తూ, ధన్యవాదాలు చెప్పే వరకు మాత్రమే మహేష్ యాంకర్ అవతారం ఎత్తబోతున్నారన్న మాట