
ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ "అల.. వైకుంఠపురములో విజయవంతంతో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమా ఎన్టిఆర్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ రామ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఏడాది మే మొదట్లో ప్రారంభం కానుంది. 2021 ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కన్నడ భామ రష్మీక మందన్నను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నాగ్ శౌర్య నటించిన 'ఛలో'తో రష్మిక మందన్న టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మరియు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన విజయ్ దేవరకొండ నటించిన 'గీతా గోవిందం'తో ఓవర్ నైట్ స్టార్ అయింది. తాజాగా మహేష్ తో 'సరిలేరు నీకెవ్వరు' లో నటించి మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయనుంది. మరి ఎన్టీఆర్ సినిమాకు రష్మీక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా చూడాలి.