
మహేష్ బాబు, రష్మీక మందన్న జంటగా నటించిన "సరిలేరు నీకెవ్వరు" సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా విజయశాంతి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "నేను మళ్ళీ సినిమాలు చేయాలని అనుకోలేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి నా కోసం ఎప్పటి నుంచో తిరుగుతున్నారు. అలానే కధ కూడా నచ్చడంతో అంగీకరించాను. మహేష్ తో నటిస్తుంటే అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. 1988లో కొడుకు దిద్దిన కాపురంలో మహేష్ కు 4ఏళ్ళు ఎంతో క్యూట్ గా ఉండేవాడు. ఒక సీన్ లో మహేష్ ని కొట్టాల్సి వస్తే.. చేయి దగ్గరకి వెళ్తోంది కానీ కొట్టడానికి మనసు రాక చాలా టేక్ లు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణ గారు వచ్చి మీరు కొడతారా? పాకప్ చెబుతారా? అని కోపడ్డారు. ఆ సమయంలో మహేష్ బాబు వచ్చి 'పర్వాలేదండీ.. కొట్టండి' అంటూ మహేష్ క్యూట్ గా చెప్పాడు. అలాంటివాడు ఈరోజు సూపర్ స్టార్ అవ్వడం, మళ్ళీ అతనితో నటించడం ఆనందంగా ఉందని" చెప్పారు.