
కొన్ని సినిమాలు థియేటర్లో హిట్ అవ్వకపోయినా టీవీలో అదిరిపోయే టిఆర్పీలను తెచ్చిపెడ్తాయి. అలాంటి సినిమానే 'ఖలేజా'. మహేష్ బాబు లో దాగున్న కామెడీ యాంగిల్ ను ఈ సినిమాతో బయటకు లాగారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఇది బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయిన టీవీలో మాత్రం ప్రసారమైన ప్రతిసారి భారీ టిఆర్పీలను సాధించింది. అయితే ఈ సినిమా నిన్నటితో 10ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో త్రివిక్రమ్ తో సాగిన ఖలేజా జర్నీను గుర్తుతెచ్చుకుంటూ మళ్ళీ మనం కలిసి చేస్తున్నాంగా దాని కోసం ఎదురుచూస్తున్నానంటూ పోస్ట్ పెట్టారు. అంతే ఇక సోషల్ మీడియాలోని షెర్లాక్ సంపంత్లు బయటకు వచ్చారు. మహేష్ పెట్టిన పోస్ట్ వెనుక పెద్ద విషయమే ఉందంటూ.....ఆ పోస్ట్ కి అర్ధం వీరి కాంబోలో సినిమా వస్తుందని మహేష్ హింట్ ఇచ్చారంటూ కధనాలు మొదలయ్యాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.