
నిన్న రాత్రి, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్లో, తన భర్త మహేష్ బాబుతో కలిసి రొమాంటిక్ ఫోజులిచ్చి ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోను వారి కుమార్తె సీతారా తీశారు. నమ్రత ఈ చిత్రాన్ని పంచుకుంటూ ఇలా అన్నారు, “మన ఉనికికి మూలకారణం ప్రేమ. నేను ఎంతగానో నమ్ముతున్నాను. సంతోషకరమైన జీవితాన్నీ గడపడానికి ప్రేమ మాత్రమే అవసరం. ” ఈ ఫోటో ఎంత రొమాంటిక్ గా ఉందంటే ఇన్ని సినిమాల్లో మహేష్ ను ఎన్నడూ అలాంటి ఎక్స్ప్రెషన్స్ తో చూడలేదు. ఇకపోతే సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హిట్ కొట్టిన మహేష్ పరుశురాం దర్శకత్వంలో తదుపరి సినిమాకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు 'సర్ఖారు వారి పాట' అనే టైటిల్ ను పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఆ పోస్టర్ కచ్చితంగా అంచనాలను మరింత పెంచింది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేసిన టీం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.