
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాలా? వయసు మీద పడుతున్నా ఇంకా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అమ్మాయిల మనసు దోచుకుంటూనే ఉన్నారు. తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' తో బాక్స్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు తన తదుపరి సినిమాపై ఫాక్స్ పెట్టారు. పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలతో పాటు మహేష్ మరో పక్క యాడ్స్ కూడా అంతే విస్తృతంగా చేస్తున్నారు. టీవీ సీరియల్స్ లేదా సినిమాల మధ్యలో వచ్చే 10 యడ్లలో కనీసం 4-5 మహేష్ నటించిన యాడ్లే ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. బైజ్యుస్, సూర్య దేవలపర్స్ మొదలుకొని తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ యాడ్ కూడా మహేష్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ యాడ్లకు సినిమాకు ఏమాత్రం తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. మహేష్ ఒక సంవత్సరం పాటు కొనసాగే యాడ్ కు కనీసం 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరి అందుకే అందరూ ఆయన్ను సినిమాల కంటే యాడ్లు ఎక్కువ చేస్తారని అంటుంటారు.