
హీరో పుట్టినరోజు అంటే తమ పుట్టినరోజు కన్నా గొప్పగా భావించి పండుగల జరుపుకుంటారు అభిమానులు. పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, భారీ కటౌట్లు, సోషల్ మీడియాలో ట్రేండింగ్ ట్వీట్లతో గోలగొల చేసేస్తారు. అయితే ఈసారి మాత్ర అలాంటివేవి చేయకండని సూపర్ స్టార్ మహేష్ తన అభిమానులను కోరాడు. ప్రపంచమంతా ఒక కనపడని భయంకరమైన వైరస్ తో యుద్ధం చేస్తున్న సమయంలో వేడుకలంటూ సామూహిక దూరం లేకుండా ఎటువంటి సెలెబ్రేషన్లు చేయొద్దని, అందరూ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను అభ్యర్ధించారు. కాబట్టి మన హీరో పుట్టినరోజు మనకు ఎంత ముఖ్యం మనతో పాటు మన కుటుంబం, మన చుట్టూ ఉన్నవాళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవటం కూడా ఇప్పుడు అత్యంత ముఖ్యం.