
ప్రతి ఒక్కరూ తమ జీవితాలతో బిజీగా ఉన్నందున ఘట్టమనేని కుటుంబం కలిసి ఒకే చోట కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ వారు ఇటీవల కలిసి ఒకే ఫ్రెమ్ లో కనిపించారు. అందరూ విలువైన సమయాన్ని గడిపారు. హీరో సుధీర్ బాబు భార్య, మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని ఇటీవల తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రియదర్శిని పుట్టినరోజును మరింత స్పెషల్ చేసేందుకు కుటుంబం మొత్తం హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ తో పాటు అతని భార్య నమ్రత, మహేష్ సోదరి మంజులతో పాటు తన భర్త, అతని మరో సోదరి పద్మావతితో పాటు భర్త గల్లా జయదేవ్, సుధీర్ బాబు మరియు అతని భార్య ప్రియదర్శిని, మహేష్ తల్లి ఇందిరా దేవి, సూపర్ స్టార్ కృష్ణ, మరియు అతని సోదరుడు హనుమంత్ రావు ఉన్నారు. అందరూ కలిసి ప్రియదర్శినితో కేక్ కట్ చేయించి భోజనాలు చేసి ఫోటో దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.