
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 'పటాస్' తో డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిల్ రావిపూడి, ఆ తరువాత తెరకెక్కించిన సుప్రీం, రాజా ది గ్రేట్, F2 చిత్రాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మహేష్ హీరోగా తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా బుల్లి తెర యాంకర్ ప్రదీప్ మచిరాజుతో కనిపించారు. ఇంతకి ప్రదీప్ తో మహేష్ ఎం చేస్తున్నాడు అంటారా..? సరిలేరు నీకెవ్వరు సినిమాను సీరియల్ ప్రోమో ద్వారా ప్రమోట్ చేసేందుకు ప్రదీప్ తో జాయిన్ అయ్యాడు. తూర్పు పడమర అనే సీరియల్ ప్రోమోలో కొన్ని సెకండ్ల పాటు మహేష్ కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూట్ తాజాగా తాజ్ డెక్కన్ లో జరిగింది. ఆ షూటింగ్ సమయంలో మహేష్ ప్రదీప్ లు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే దేశ భక్తి, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల కానుంది.