
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు". సంక్రాంతిగా కానుకగా జనవరి 11న రిలీజ్ కానున్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది. జూలై 5న షూటింగ్ ప్రారంభించిన బృందం డిసెంబర్ 18న పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టారు. ఈ సినిమాలో మహేష్ మొదటిసారి ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నారు. రష్మీక మందన్న హీరోయిన్ గా మహేష్ సరసన మొదటిసారి జోడికట్టింది. ఈ సినిమా ద్వారా ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలా సినిమాలోని ఎన్నో అంశాలు చిత్రంపై అంచనాలను పెంచేసాయి. అయితే "అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఆన్ ది వే....రేపు సాయంత్రం 5గంటల 4నిమిషాలకు అనౌన్స్ చేస్తానంటూ" సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మరి ఆ సర్ప్రైజ్ ఏమైనా ఫైట్ సిన్ టీజర్ అయుంటుందా అని అభిమానులు అంచనా వేస్తున్నారు.