
చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటులలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమను రారాజుగా పాలించారు. చిరుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఫ్యాన్‌బేస్ ఉంది. అందరికీ తెలిసిన మరియు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆచార్య'. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా కారణంగా షూటింగ్ ను వాయిదా వేసిన మేకర్స్ ఇంకా ప్రారంభించలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అదే... సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి వాయిస్ఓవర్ ఇవ్వబోతున్నారన్న వార్త హల్ చల్ చేస్తుంది. చిరంజీవి అంటే అభిమానం ఉన్న మహేష్ బాబుకు రామ్ చరణ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది అలానే ఈ చిత్రాన్నికి దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివతో మంచి అనుబంధం ఉంది. దీంతో శివ ఈ సినిమాకు వాయిస్ఓవర్ ఇవ్వమని అడగగానే మహేష్ ఒప్పుకున్నారని తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే ఆచార్య మీద అంచనాలు మరో మెట్టుఎక్కినట్లే.