
మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు మహేష్. అయితే, మీడియా మరియు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న చర్చ ఏమిటంటే, మరోసారి తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఆర్ మురుగదాస్తో కలిసి ఒక చిత్రం కోసం పని చేయనున్నారు. వీరిద్దరి కలయికలో థ్రిల్లర్ డ్రామా 'స్పైడర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ సినిమాను చేసినందుకు మహేష్ బాబును నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తయిన తర్వాత తదుపరి చిత్రానికి ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది.