
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సంవత్సరం క్రితం తన మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ ను అగ్ర డిస్ట్రిబ్యూటర్ ఏషియా సినిమాస్ తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏఎంబీ మల్టీప్లెక్స్ కు గోయర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్, అనేక ప్రశంసలను కూడా అందుకుంది. ఏఎంబీ సినిమాస్ ప్రారంభమై ఇటీవలే ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు తన ఆనందం పంచుకున్నారు. అయితే మహేష్ బాబు తన మల్టీప్లెక్స్ ను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారట. ఏషియా సినిమాస్ తో కలిసి బెంగళూరులో కూడా ఏఎంబీ సినిమాస్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఇది ఇంకా ఆలోచనే అయినప్పటికీ యూఎస్ నుండి తిరిగి రాగానే ఏషియా సినిమాస్ అధినేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక 'సరిలేరు నీకెవ్వరు' సాధించిన సూపర్ సక్సెస్ ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు మహేష్ యూఎస్ వెళ్లిన విషయం తెలిసిందే.