
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మీక జంటగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ తన తదుపరి సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. మహేష్ కెరియర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాల్లో మహర్షి ఒకటి. అయితే అలాంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో మహేష్ మరో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ వెల్లడించాడు. షూటింగ్ మాత్రం మూడు నెలల గ్యాప్ తర్వాత ప్రారంభిస్తానని...ఫ్యామిలీతో సమయం గడిపేందుకు బ్రేక్ తీసుకుంటున్నాని చెప్పారు. అంతే కాదు కేజీఎఫ్ లాంటి సంచలన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తన సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు. "ప్రశాంత్ నీల్ నాకు కొన్ని లైన్స్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడే ఆ సినిమా కంఫర్మేషన్ గురించి నేనేమి చెప్పలేను" అని తెలిపారు.