
బాలీవుడ్ యంగ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజపుత్ జూన్ 14న అనుమానాస్పదంగా అతని నివాసంలో మరణించారు. ఈనేపథ్యంలో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై ఎన్నో అనుమానాలు. ఆమె సుశాంత్ ను ఆ పరిస్థితికి తెచ్చిందంటూ కుటుంబం ఎఫైర్ కూడా ఫైల్ చేసింది. ఇక ఆమెను అరా తీసిన పోలీసులు డ్రగ్స్ యాగింల్ కూడా ఉందని కనిపెట్టి ఎంసీబీ టీంను రంగంలోకి దింపారు. ఈమేరకు ఆమెను మరియు ఆమె తమ్ముడు షోవీక్ చక్రవర్తిని జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీలోకి తీసుకున్నాక డ్రగ్స్ యాంగిల్ దిశగా విచారణ చేపడుతున్న ఎంసీబీ, సీబీఐకు రియా మెల్లిగా గొప్ప గొప్ప సినీ తారల పేర్లను వెల్లడించినట్లు తెలుస్తుంది. మొన్నీమధ్యే బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు వినపడగా.... నిన్నటికి నిన్న బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు కూడా జాతీయ మీడియాలో మారుమోగింది. ఇక ఇప్పుడు ఎవరు ఉహించని విధంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోధ్ఖర్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె కూడా డ్రగ్ పార్టీల్లో పాల్గొంటారని రియా చెప్పినట్లుగా వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి మహేష్ బాబు భార్య పేరు కూడా ఇందులో వినిపించడం వెనుక ఎంత వరకు నిజం ఉందొ తెలియాలి.