
మహేష్ బాబు హీరోగా నటించిన "మహర్షి" చిత్రం ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో స్పెషల్ అని మహేష్ చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించి ఈ ఏడాది బ్లాక్ బస్టర్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మహర్షిలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అల్లరి నరేష్ ను మళ్ళీ లైమ్ లైట్ లో నిలబెట్టింది మహర్షి. అయితే ఈ సినిమా పుణ్యమా అని డైరెక్టర్ వంశీ పైడిపల్లి, సూపర్ స్టార్ మహేష్ బాబు క్లోస్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎంత క్లోస్ అంటే...వీరు వాళ్ల ఫ్యామిలిలతో కలిసి ఇంటర్నేషనల్ టూర్లు, లండన్ లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ కలిసి తిరిగి చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు క్రిస్టమస్ సందర్భంగా మహేష్ ఇంట్లో వంశీ పైడిపల్లి తన ఫ్యామిలీతో కలిసి మహేష్ ఇంట్లో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.