
సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా పుణ్యమా అని ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. గత ఏడాది 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్ తో 'సర్కారు వారి పాట' సినిమా మొదలుపెట్టాడు మహేష్. అల...మొదలు పెట్టాడో లేదో ఇలా కరోనా వచ్చి బ్రేక్ వేసింది. కొంతకాలం క్రితమే ఇంటి నుండి బయటకు వచ్చి పలు కమర్షియల్ యాడ్లు చేస్తూ కెమెరాలకు చిక్కుతున్నాడు. అయితే ఈమధ్యకాలంలో మహేష్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా తన ఇంట్లోనున్న జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఒక చిన్న వీడియో షేర్ చేసి 'మీ ఆటను రైజ్ చేయండి.. ఇంకా పైకి లేవండి.. హద్దులు లేవని గుర్తించండి. . ఎవ్వరూ ఆపరేనంతగా దూసుకువెళ్లండి అని' క్యాప్షన్ పెట్టాడు.